ఊరు కాచే ముత్తైదా గంగమ్మ గంగమ్మ పదవమ్మ పదవమ్మ
అవణి కాచే ముతైదా మారెమ్మ మారెమ్మ పొదామా మారెమ్మా
మన సటి ముతైదే వేచి ఉంది వేదనతో
పొదాము రారండి సౌభాగ్యం కనరండి
ఊరు కాచే ముత్తైదా గంగమ్మ గంగమ్మ పదవమ్మ పదవమ్మ
అవణి కాచే ముతైదా మారెమ్మ మారెమ్మ పొదామా మారెమ్మా
ఉదయమె లేచి ప్రతి ముత్తైదు అమ్మను కాద తలిచేది
తన మదిలొని కలతలలన్ని అమ్మలకేగ తెలిపేది
నెలతలే లేకుంటె దేవుడికి నెలవేది
భక్తులే రాకుంటే గుడికి ఇక వెలుగేది
దయతొటి కుంకుమ పూలు అక్షింతలు మనమంత ఇవ్వాలి తన తాలి నిలపాలి
తాలి కాచే ముత్తైదా యెల్లమ్మా యెల్లమ్మా పొదామ రావమ్మ
ఉసురు కాచే ముత్తైదా నూకమ్మా నూకమ్మా రావె నూకమ్మ
భర్తల మేలే మనసున కొరి వ్రతమే చేయు ప్రతి నారి
చెట్టు పుట్ట మన్ను మిన్ను మన రూపాలని మొక్కెదరే
వారి ఆ నమ్మికయే దేవతల ఉనికమ్మ ఆ నమ్మకమె సడలిన చో భక్తికి అర్దమె లేదమ్మ
ఆశ తొటి ముత్తైదు వేచి ఉంది మన కొరకు పొదాము రారండి సౌభగ్యం నిలపండి
ఊరు కాచె ముత్తైదా గంగమ్మ గంగానమ్మా మగని కాచె ముత్తైదా మారెమ్మ మారెమ్మా
తాలి కాచే ముత్తైదా యెల్లమ్మ యెల్లమ్మ
ఉసురు కాచె ముత్తైదా రావమ్మ నూకాలమా కులముకాచే ముత్తైదా పొలమ్మ పొలేరమ్మ
అభయమిచే ముత్తైదా ముత్యమ్మ ముత్యలమ్మ బ్రతుకునిచ్చే ముత్తైదా అంకమ్మ అంకాలమ్మ
No comments:
Post a Comment