🎧🌹రాజు పాటల పల్లకి లిరిక్స్🌹🎧
పల్లవి:💘raju
జగదానంద కారకా జయ జానకీ ప్రాణ నాయకా...
ఆ.... జగదానంద కారకా జయ జానకీ ప్రాణ నాయకా శుభస్వాగతం ప్రియ పరిపాలకా
ఇద్దరు: జగదానంద కారకా జయ జానకీ ప్రాణ నాయకా శుభస్వాగతం ప్రియ పరిపాలకా
మంగళకరమౌ నీరాక ధర్మానికి వేదిక ఔగాక మా జీవనమే ఇక పావనమౌగాక
నీ... పాలన శ్రీకరమౌగాక సుఖశాంతులు సంపదలిడుగాక నీ రాజ్యము ప్రేమ సుధామయమౌగాక
కోరస్: జగదానంద కారకా జయ జానకీ ప్రాణ నాయకా శుభస్వాగతం ప్రియ పరిపాలకా
చరణం: 1⃣raju
సార్వభౌమునిగ పూర్ణ కుంభములు స్వాగతాలు పలికే రాజ్యమేలమని ధర్మ దేవతే రాగమాల పాడే
కోరస్: నాల్గువేదములు తన్మయత్వమున జలధి మారు మ్రోగే
కోరస్: న్యాయదేవతే శంఖమూదగా పూలమాల కురిసే
రాజమకుటమే ఒసగెలే నవరత్న కాంతి నీరాజనం సూర్య వంశ సింహాసనం పులకించి చేసె అభివందనం
సామ్రాజ్య లక్ష్మియే పాదస్పర్శకీ పరవశించిపోయే
కోరస్: జగదానంద కారకా జయ జానకీ ప్రాణ నాయకా శుభస్వాగతం ప్రియ పరిపాలకా
కోరస్: జగదానంద కారకా జయ జానకీ ప్రాణ నాయకా శుభస్వాగతం ప్రియ పరిపాలకా
చరణం: 2⃣raju
రామపాలనము కామధేనువని వ్యోమసీమ చాటే రామశాసనము తిరుగు లేనిదని జలధి బోధ చేసే
కోరస్: రామ దర్శనము జన్మ ధన్యమని రాయికూడ తెలిపే కోరస్: రామ రాజ్యమే పౌరులందరిని కీర్తి బాట నిలిపే
రామమంత్రమే తారకం బహుశక్తి ముక్తి సంధాయకం రామనామమే అమృతం శ్రీరామకీర్తనం సుకృతం
శ్రీరామ చంద్రుడే లోకరక్షయని అంతరాత్మ పలికే
జగదానంద కారకా జయ జానకీ ప్రాణ నాయకా శుభస్వాగతం ప్రియ పరిపాలకా
జగదానంద కారకా జయ జానకీ ప్రాణ నాయకా శుభస్వాగతం ప్రియ పరిపాలకా
ఇద్దరు:
మంగళకరమౌ నీరాక ధర్మానికి వేదిక ఔగాక మా జీవనమే ఇక పావనమౌగాక
నీ... పాలన శ్రీకరమౌగాక సుఖశాంతులు సంపదలిడుగాక నీ రాజ్యము ప్రేమ సుధామయమౌగాక
జగదానంద కారకా జయ జానకీ ప్రాణ నాయకా శుభస్వాగతం ప్రియ పరిపాలకా
🎼రాజు From ఒంగోలు జిల్లా🎼
9666926747
rajupatalapallakilyrics.blogspot.com/?m=1
No comments:
Post a Comment